శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

SMTV Desk 2019-05-03 11:56:48  ttd, tirumala tirupati devasthanam arjiitha seva tickets released

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో నేడు ఆగస్టు నెల ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నారు. ఈ టికెట్లను www.tirumala.org వెబ్‌సైట్‌లో ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచనుంది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను లక్కీడిప్‌ విధానంలో జారీ చేస్తుంది. విశేష పూజ, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కరెంటు బుకింగ్‌ కింద వెంటనే నమోదు చేసుకోవచ్చు. అన్నీ కలిపి 60 వేలకుపైగా టికెట్లను తితిదే విడుదల చేయనుంది.