భారత్ సినిమా నుంచి మరొక రొమాంటిక్ సాంగ్

SMTV Desk 2019-05-01 12:17:52  Bharat, Salman Khan,

బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌ సినిమా అంటే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. ఈ జంటకు అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ అలాంటింది. త్వరలో భారత్ చిత్రంతో సల్మాన్‌, కత్రినా అభిమానులను అలరించనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని చాష్నీ.. అంటూ సాగే ఓ రొమాంటిక్‌ పాట టీజర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. టీజర్‌లో సల్మాన్‌, కత్రినా కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. మరోసారి వీరిద్దరి కెమిస్ట్రీతో అభిమానులను ఫిదా చేశారు.టైగర్ జిందా హేయ్ లో సాంగ్ ఎంత గానో ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే .. ఈ పాటలో కూడా వాళ్ళ కెమిస్ట్రీ ఇంకా అద్భుతంగా ఉంది ..భారత్ సినిమాకు అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పట్నుంచి 70 ఏళ్ల వరకూ దేశంతో పాటే ఎదుగుతూ నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం లాంటి ఆటుపోట్లను దాటుకుంటూ ఓ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన భారత్‌ అనే వ్యక్తి కథను తెరకెక్కిస్తున్నారు. రంజాన్‌ కానుకగా జూన్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.