వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

SMTV Desk 2019-04-28 18:55:41  Sunstroke

తాగడం వలన వడదెబ్బ తగులుతుంది. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఉషోగ్రత ఎక్కువ అవుతుంది, అటువంటి స్థితిలో శరీరంలో కణాలు చనిపోయి అనేక మార్పులు చోటుచేసుకుంటాయి.

వడదెబ్బకు గురయ్యేవారు:

చిన్నపిల్లలు, పసిపిల్లలు
గర్భిణి స్త్రీలు
అనారోగ్యంగా ఉన్నవారు
వృద్ధులు
ఎండలో ఎక్కువగా పని చేసేవారు
మద్యం సేవించేవారు.

వడదెబ్బకు గురయితే కలిగే లక్షణాలు:

కళ్ళు తిరిగి పడిపోవడం
నీరసం
తీవ్రమైన తలనొప్పి
వికారం
కండరాల బలహీనత.

వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉంటే కనిపించే లక్షణాలు:

ఆయాసం అధికం అవుతుంది
గుండె వేగంగా కొట్టుకోవడం
ఎండ తీవ్రతను తట్టుకోలేక వింతగా ప్రవర్తిస్తారు
తక్కువ రక్తపోటు
ఒకవేళ ఉష్ణోగ్రత 105 ఫారెన్హీట్ మించితే మెదడు పనితీరు మందగిస్తుంది.

చేయవలసిన చికిత్స:

వడదెబ్బకు గురయిన వెంటనే వారిని ముందుగా నీడ ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళాలి.
తరువాత వారిని సమాంతరంగా ఉన్న ప్రదేశంపై పడుకోబెట్టాలి. వారి తలను కొంచెం ఎత్తులో పైకి పెట్టాలి.
అలాగే చల్లటి నీటితో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.
వీలైనంత వరకు ఆ ప్రదేశమంతా చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి.
అలాగే వారికి శ్వాస సరిగ్గా అందుతుందో లేదో చూడాలి ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
అవసరమైతే వెంటనే వారికి ఇతరుల నోటి ద్వార వెంటనే శ్వాసను అందించాలి.

వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ఆహారం:

ఎప్పుడూ మంచి నీళ్ళు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు ఎక్కువగా తాగుతూ ఉండాలి.అలాగే వీలైనంత వరకు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళకూడదు. ఉష్ణోగ్రతను బట్టి బయటకు వెళ్ళే పనులను వాయిదా వేసుకోవాలి. ఒకవేళ వెళ్ళవలిసి వస్తే గొడుగును వారితో తప్పకుండ తీసుకువెళ్ళాలి.అలాగే శరీరానికి ఎండ తగలకుండా వడదెబ్బ బారిన పడకుండా లేత రంగు దుస్తులు,కాటన్ దుస్తులు వస్త్రాలు పూర్తిగా ధరించాలి.ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి ఎక్కువగా ద్రవాల్ని తీసుకోవాలి, నూనెతో చేసిన పదార్ధాలు తీసుకోకూడదు, మాంసం తినకపోవడం మంచిది.ఎక్కువగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలతో చేసిన ఆహారాన్ని తీసుకోవాలి.వడదెబ్బను తట్టుకోవాలంటే శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్నీతీసుకోవాలి. ముఖ్యంగా వేడిని తగ్గించే ఆహారాన్నిపండ్లను, కూరగాయల్ని, అలాగే పండ్ల రసాలు, కొబ్బరినీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచే పండ్లను, కూరగాయలను, దోసకాయలు, కొబ్బరిబొండాలు, ఆకు కూరలు, ఖర్బూజ, రాగి అంబలి, జొన్న జావ వంటివి తీసుకోవాలి.శరీరం నుండి కోల్పోయిన నీటిని సమతుల్యం చేయాలంటే వారికి మజ్జిగ, నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరి నీళ్ళు, వేడి తగ్గించి ఒంటిని చల్లబరిచే పుదీన రసం, లస్సీ, కొత్తిమీర వేసిన మజ్జిగ మొదలైనవాటిని తాగించాలి. ఇలా చేయడం ద్వారా వారిని తిరిగి సాదారణ స్దితికి తీసుకురావచ్చు .