టీటీడీకీ ఊరట

SMTV Desk 2019-04-28 18:52:47  Bangaram

ఎన్నికలు జరుగుతున్న సమయంలో తమిళనాడులో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 1,381 కిలోల బంగారం ఎన్నికల సంఘం అధికారులు సీజ్ చేసిన విషయం సంచలనంగా మారడం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి ఇతర పార్టీలు. అయితే, ఈ బంగారం తరలింపు వ్యవహారంలో టీటీడీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు క్లిన్‌ చిట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్.

అదేమంటే... ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాము బంగారాన్ని సీజ్ చేశామని తెలిపారు తిరువళ్లూరు కలెక్టర్. తమిళనాడులోని ఎన్నికల ముందు రోజు కావడంతో అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ.. కిందస్థాయి సిబ్బంది బంగారాన్ని సీజ్ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు.

అదేవిధంగా దాదాపు రూ. 400 కోట్ల విలువైన బంగారం కావడంతో రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, ఇన్‌కంట్యాక్స్‌ విభాగాలు పరిశీలన చేశాయని.. అన్ని పత్రాలును సరిచూసుకొని బంగారాన్ని తిరిగి అప్పగించడంలో ఆలస్యం జరిగిందని తిరువళ్లూరు కలెక్టర్ వివరణ ఇచ్చారు.