జగన్‌కి ప్రతి శుక్రవారం జైలు వారం: గోరంట్ల

SMTV Desk 2017-08-21 12:43:58  TDP,YSRCP, Chandrababu naidu, YS Jagan, Botsa Satyanarayana, Dharmana Prasada Rao

కాకినాడ, ఆగస్ట్ 21: తెదేపా ప్రభుత్వం కాకినాడ అభివృద్ధికి కట్టుబడివుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కాకినాడ అభివృద్ధి తెదేపా చేసింది. 1200కోట్ల నిధులతో కాకినాడ స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దుతాం. కాకినాడ, నంద్యాల ప్రజలకు తెలుసు ఎవరికి ఓట్లు వేయాలో అని తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. రాష్ట్రం కోసం సోమవారాన్ని పోలవరంగా మార్చిన ఏపీ ముఖ్యమంత్రికి, ప్రతీ శుక్రవారాన్ని జైలు వారంగా మార్చుకున్న వైఎస్ జగన్‌కి మధ్య తేడాన్ని ప్రజలు గమనించాలని ఆయన పిలుపునిచ్చారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో ఏ2 విజయసాయిరెడ్డి, లిక్కర్‌ మాఫియా బొత్స సత్యనారాయణ, మైనింగ్‌ మాఫియా ధర్మాన ప్రసాదరావు కాకినాడ వచ్చి గూండాగిరి చేస్తుంటే సహించేది లేదని ఆయన మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు.