రేవ్‌ పార్టీ ఎఫెక్ట్ : ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ సస్పెండ్

SMTV Desk 2019-04-26 15:05:51  rave party in vishakapatnam

విశాఖపట్నం: తాజాగా విశాఖలో జరిగిన రేవ్‌ పార్టీకి మద్యం వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండాక్ట్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మద్యం విక్రయానికి అనుమతి ఇవ్వడంతో ఇక్కడ పని చేస్తున్న ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ సుబ్బారావ్ఞను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ కోసం కేంద్ర కార్యాలయం నుంచి జాయింట్‌ కమిషనర్‌ దేవ కుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు. నివేదిక తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని సాధారణ నిబంధనల తోపాటు ఈ కేసులో ఎన్నికల నిబంధనలు కూడా పరిగణలోకి తీసుకోనుందని కమిషనర్‌ ముఖేష్‌కుమార్‌ మీనా వివరించారు. దీంతోపాటుగా పలు ఆరోపణల నేపధ్యంలో శ్రీకాకుళం ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ ఆధినారాయణమూర్తిని ప్రభుత్వానికి సరెండర్‌ చేసి పూర్తి స్థాయి విచరణకు ఆదేశించామన్నారు. పూర్తి స్థాయి విచారణ నివేదికలు వచ్చిన తరువాత వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.