రేపు మధ్యాహ్నం శ్రీవారం దర్శనం నిలిపివేత

SMTV Desk 2019-04-26 12:51:49  ttd, tirumala tirupati devasthanam, lord venkateshwara

తిరుమల: తిరుమల దేవస్థానంలో శనివారం( ఏప్రిల్ 27) రోజున నాలుగున్నర గంటల పాటు వెంకన్న స్వామి దర్శనం నిపివేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. అయితే ఈ విషయంపై శ్రీవారి భక్తులకు టిటిడి విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తోంది. సాధారణంగా గ్రహణ సమయంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఇలా మూసివేయడం జరుగుతుంది. అయితే ఆలయాన్ని మూసివేయకుండా తెరచివుంచి భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే తిరుమలలో ఎంతో పవిత్రంగా, అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా జరుగుతున్న ‘శ్రీవరాహస్వామి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాల్లో చివరిరోజు శనివారం కావడంతో 27 శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఏకధాటిగా నాలుగున్నర గంటలు శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించరు. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించి తమ దర్శనం సమయాన్ని ముందుగా నిర్ణయించుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది.