లెక్కలు తికమకగా అనిపిస్తే చంద్రబాబు దగ్గరకు ట్యూషన్ కు వెళ్ళు

SMTV Desk 2019-04-20 15:28:28  Ap, JD laksmi Narayana, vijaya sai reddy

జనసేన పార్టీలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమిటో తనకు తెలిదని... లెక్కలు తికమకగా అనిపిస్తే చంద్రబాబు దగ్గరకు ట్యూషన్ కు వెళ్లాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాన్ని విడిచారు. వీరిద్దరి మధ్యా గత రెండు రోజులుగా పోటీ చేసిన సీట్లు.. గెలిచే సీట్ల లెక్కలపై సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది.

తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించిన విజయసాయి.. "జేడీ గారూ, గ్లాసు పార్టీలో మీరేమిటో నాకు తెలియదు. చంద్రబాబుకు మీ పార్టీ ఇచ్చిన బీ ఫారాలు పోను మిగిలింది 65 సీట్లు. మరో పార్టనర్ పాల్ బీ ఫారాలు పోగొట్టుకున్నట్టు గానే మీ నాయకుడూ 80 సీట్లలో డమ్మీలను దింపి త్యాగం చేశారు. ఈ లెక్కలు తికమకగా ఉంటే బాబు దగ్గర ట్యూషన్‌కు వెళ్ళండి" అని పేర్కొన్నారు.