చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్ ..మోదీ

SMTV Desk 2019-04-20 12:55:41  Chandrababu, Jagan Modhi,

నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే విసేష్ తెలిపారు. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ కూడా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

చంద్రబాబు పుట్టిన రోజును పురస్కరించుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బాబు ఈ రోజు అమరావతి నుంచి హైదరాబాద్ రానున్నారు. ఇక్కడ నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరుపతికి వెళ్తారు. కోటకొమ్మలవీధిలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని బాబు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బాబుతో పాటు భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, రోహిత్ పాల్గొంటారు.