విశాఖ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసు తాజా అప్ డేట్

SMTV Desk 2019-04-19 12:22:06  Vishaka, Rave party,

విశాఖపట్టణంలో సంచలనంగా మారిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసును పోలీసులు మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురికి అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుల కాల్‌డేటా ఆధారంగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడ్ లాంగ్వేజ్‌లో వీరు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోడ్ డీకోడ్ లాంగ్వేజీలో ఓ వెబ్‌సెట్‌ను నడుపుతున్న కొందరు ఆన్‌లైన్‌లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాలో ప్రత్యేక గ్రూపులు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ వీరరాఘవ అలియాస్ సోను వివిధ రాష్ట్రాల డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉండగా.. గాలింపు చర్యలను చేపట్టారు.