జనసేన పార్టీ పెద్ద అవినీతి పార్టీ

SMTV Desk 2019-04-19 12:19:41  Ka Paul. Janasena,

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామన్న నమ్మకం లేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మేము గెలుస్తామనే నమ్మకం లేదు. మాకు సింబల్‌ మార్చి 9 వరకు ఇవ్వలేదు. టైమ్ చాలా తక్కువ మిగిలింది. మాకు ఫ్యాన్‌ సింబల్‌ రాకుండా బీజేపీ, వైసీపీ అడ్డుపడింది’ అని ఆరోపించారు. అన్ని పార్టీలూ ఓటర్లకు డబ్బులు పంచాయని.. కానీ తాము ఒక్కిరికీ ఒక్క పైసీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్టు ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనకు చెప్పారని పాల్‌ వెల్లడించారు. జనసేన పార్టీ పెద్ద అవినీతి పార్టీ అని ఆయన ఆరోపించారు. పార్టీలకతీతంగా తనను అభిమానిస్తున్నందుకు కేఏ పాల్‌ కృతజ్ఞతలు తెలిపారు.