జనసేన పార్టీ కార్యాలయాలు అద్దెకు ఇచ్చే స్థాయికి దిగజారిపోయాయి .. కత్తి మహేష్ సంచలనం

SMTV Desk 2019-04-18 18:09:30  Janasena, kathi Mahesh,

జనసేన పార్టీ అధినేత పవన్ రాజకీయ అరంగేట్రం తర్వాత అతన్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు వచ్చిన పాత్రల్లో కత్తి మహేష్ కూడా ఒకరు.పవన్ పై అతను చేస్తూ వచ్చిన విమర్శలు అప్పట్లో పెద్ద సంచలంగా మారాయి.ఆ తర్వాత ఆ వివాదం అంతా ముగిసిపోయింది.కానీ ఇప్పుడు ఎన్నికల అనంతరం మళ్ళీ కత్తి మహేష్ ను మన మీడియా చానెళ్లు మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.

పవన్ కళ్యాణ్ అనే టాపిక్ లేకపోతే వారికి రేటింగులు రావనుకుంటున్నారో ఏమో మళ్ళీ పవన్ పై ప్రశ్నలు వేశారు.దానికి కత్తి ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో మూడో ప్రత్యాన్మయం గా జనసేన అనేది మంచి ఛాయిస్ కానీ నాకు మాత్రం ఆ పార్టీలో ఏ మాత్రం నిజాయితీగా పని చేస్తున్న భావన ముందు నుంచి కనిపించడం లేదని దాన్నే తాను చెప్పానని దాన్ని పవన్ అభిమానులు విమర్శలుగా తీసుకుని తనని ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు.

పవన్ అకస్మాత్తుగా బీఎస్పీ తో పొత్తు పెట్టుకోవడం వలన అటు ఆ పార్టీని బలోపేతం చేసుకోలేకపోయారు,ఇటు జనసేన కూడా పూర్తి స్థాయిలో బలోపేతం కాలేకపోయిందని పవన్ ఇదే పని ఎప్పుడో చేసి ఉంటే ఈ పాటికి 30 నుంచి 50 సీట్ల వరకు గెలుచుకునేందుకు అవకాశం ఉండేదని కానీ ఇప్పుడున్న పరిస్థిలోతుల్లో చూస్తున్నట్టయితే కనీసం రెండు మూడు కూడా వచ్చేలా కూడా లేకపోగా వారి పార్టీ కార్యాలయాలు అద్దెకు ఇచ్చే స్థాయికి దిగజారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేసారు.