ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి ఈసీ మద్దతు : ఆనందబాబు

SMTV Desk 2019-04-17 17:17:30  ysrcp, ec, ap elections, minister nakka aanandababu

అమరావతి: మంత్రి నక్కా ఆనందబాబు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఈవీఎంల లోపాలు, దౌర్జన్యాలతో వైసీపీ చేసిన కుట్ర అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని అన్నారు. వైసీపీ వ్యవహరించిన తీరుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పచ్చని డెల్టా ప్రాంతంలోనూ వైషమ్యాలు రెచ్చగొట్టారని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీకి ఈసీ సహకరించిందని ఆరోపించారు.