30 సర్వేల్లో వెల్లడైంది ఒకటే నిజం: ఎంపీ విజయసాయి రెడ్డి

SMTV Desk 2019-04-09 15:21:52  ysrcp, vijayasai reddy, ysrcp, survey

అమరావతి, ఏప్రిల్ 09: ఈ ఎన్నికల్లో గెలవనున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి వ్యాఖ్యానించారు. జాతీయ మీడియా సర్వేల్లో ఇదే వెల్లడైందని చంద్రబాబు పచ్చ మీడియా మాత్రం దొంగ సర్వేలను వదులుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "జాతీయ మీడియా సర్వేల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ 120 పైగా అసెంబ్లీ స్థానాలు, 23 లోక్ సభ సీట్లు గెలుస్తుందని అనేక సార్లు వెల్లడైంది. 6 నెలలుగా జరిపిన 30కి పైగా సర్వేల్లో ఫలితాలు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు అను’కుల’ మీడియా చంద్రబాబుదే గెలుపని దొంగ సర్వేలను వదుల్తున్నాయి" అని ఆరోపించారు.