పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ పరులు ఉంటారు

SMTV Desk 2019-04-04 17:06:00  pawan kalyan,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసారు.పవన్ తన ప్రసంగాల్లో ఇతర పార్టీల నేతలపై ఏ స్థాయిలో విమర్శలు చేసారో అందరికీ తెలుసు,ఇప్పుడు తాజాగా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు , జగన్ సహా గంటా శ్రీనివాసరావు లపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇప్పుడున్న అధికార పక్ష నేత చంద్రబాబు మరియు ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డిల పక్కన ఎలాంటి వ్యక్తులు ఉంటారో చెప్తూ “చంద్రబాబు గారు పక్కన గంట కొట్టి భూ కబ్జాలు చేసే గంటా శ్రీనివాస్ లాంటి వాళ్లు ఉంటారు,జగన్ గారు పక్కన క్రిమినల్స్ ఉన్నారు,పవన్ కళ్యాణ్ పక్కన జేడీ లక్ష్మీనారాయణ లాంటి నిజాయితీ పరులు ఉంటారు” అంటూ గంటా శ్రీనివాసరావు మరియు జగన్ ల పై సంచలనం కామెంట్స్ చేసారు.