నీ వల్లే నవ్వుల్ నవ్వుల్

SMTV Desk 2019-04-03 15:01:34  Ka Paul,

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయం రణరంగాన్ని తలపిస్తున్న వేళ ప్రజాశాంతి ఆపార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ప్రచార సరళి నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ఎన్నికల బరిలో నిలిచిన మొదటి నుండే పాల్ తనదైన వింత వింత పోకడలతో ప్రచారం కొనసాగిస్తూ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తానే సీఎం అని, తనను గెలిపిస్తే విదేశాల నుండి లక్షల కోట్ల డబ్బులు తెస్తానంటూ వ్యాఖ్యానిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల మధ్యనే కాకుండా ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన సమయంలో కూడా ఈసీ కార్యాలయంలో పాల్ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ వెళ్ళటం అందరిని నవ్వించింది. మరి పాల్ ఈ విన్యాసాల వెనక ప్రజలను ఆకర్షించాలన్న కుతూహలమా లేక ఇంకేమైనా ఉద్దేశం ఉందా అన్న సందేహం కలుగుతోంది.