జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సామాన్యుడి ఫైర్

SMTV Desk 2019-04-02 19:32:52  Janasena, pawan Kalyan,

సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా సామాన్యుల అభిప్రాయాల‌తో హోరెత్తుతోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌తీ ఒక్క‌రికి స్మార్ట్ ఫోన్ ఆయుధంలా మారిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌శ్నించ‌డం అంద‌రి హ‌క్కు అని రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కును ప్ర‌తీ ఒక్క‌రు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ హ‌క్కునే ఇంకొంచెం ఎక్కువ స్థాయిలో వినియోగించుకున్న‌ట్టు తెలుస్తుంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఓ సామాన్యుడు త‌న‌దైన శైలిలో రెచ్చిపోయాడు. ఒక‌టి త‌రువాత మ‌రొక‌టి ఇలా ప్ర‌శ్న‌ల‌ను సంధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇంత‌కీ ఆ సామాన్యుడు అడిగిన ప్ర‌శ్న‌ల అంశానికొస్తే వివ‌రాలిలా ఉన్నాయి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే వ్య‌క్తి 2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన పార్టీని స్థాపించార‌ని, పార్టీ స్థాప‌న రోజు ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌శ్నించ‌డ‌మే జ‌న‌సేన చేసే మొద‌టి పోరాట‌మ‌ని క‌రాఖండిగా చెప్పారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో బీజేపీకి, టీడీపీకి బేష‌ర‌త్తు మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆ స‌మ‌యంలో ప‌వన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ అధికారంలోకి వ‌స్తే వారు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌కుంటే ప్ర‌శ్నించే పూచీ త‌న‌ద‌ని ప‌వ‌న్ తెలిపాడు.

కానీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వ‌చ్చి ఐదేళ్ల పాల‌న‌లో ఎటువంటి హామీల‌ను అమ‌లు చేయ‌కున్నా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఎటువంటి ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్త‌లేద‌ని, నోరు మూసుకుని ఉన్నాడ‌ని ఆ సామాన్యుడు ప్ర‌శ్నించారు. ప‌వ‌న్‌కు క‌నీసం ఇంగిత జ్ఞానం ఉంద‌నుకున్నా. కానీ వైసీపీని ప్ర‌శ్నించ‌డంతో ఆ ఇంగిత జ్ఞానం కూడా లేద‌ని తేలిపోయింద‌న్నారు.

23 మంది వైసీపీ ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు నాయుడు సంత‌లో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొంటే ఒక్క‌మాటంటే.. ఒక్క మాట ప్ర‌శ్నించ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేత‌గాడ‌న్న విష‌యం అప్పుడే ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మైపోయింద‌ని ఆ సామాన్యుడు త‌న వీడియోలో పేర్కొన్నాడు. చంద్ర‌బాబును ప్ర‌శ్నించ‌డం మానేసి అసెంబ్లీ అంటే భ‌య‌ప‌డి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పారిపోయాడంటూ వైసీపీని ప్ర‌శ్నించ‌డం ఏంట‌ని ఆ సామాన్యుడు ప‌వ‌న్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెబితేనే జ‌గ‌న్ ఇక్క‌డ ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌లు ఇచ్చాడంటూ ప‌వ‌న్ ఆరోపిస్తున్నాడ‌ని, గ‌త తొమ్మిదేళ్లుగా దేశ నేత‌ల‌ను ఉ.. ఉ.. పోయిస్తున్న ఒకే వ్య‌క్త నాయ‌కుడు ఒక్క జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాత్ర‌మేన‌ని, ఒక్క జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఎదుర్కోలేక దేశ నేత‌లంతా త‌న‌క‌లాడుతున్నార‌న్నారు.