నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు పూర్తి భరోసా

SMTV Desk 2019-04-01 11:38:09  giudiwada, de

గుడివాడ తెలుగుదేశం అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గుడివాడ మొత్తం మీద నాలుగు లైన్ల రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదుశం అధికారంలోకి వస్తే గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి చంద్రబాబు పూర్తి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. గుడివాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే గుడివాడ చుట్టూ వంద అడుగుల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గుడ్లవల్లేరులో 38 ఎకరాల విస్తీర్ణంలో 1500 జిప్లస్ 2 గృహాలను నిర్మిస్తామని దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. అలాగే గుడివాడలో పేదలకు నిర్మించి ఇచ్చే 10 వేల ఇళ్లకు బకాయిలు రద్దు, మరో 40 ఎకరాలు సేకరించి అదనంగా మరో 3 వేల టూ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.