అధికారంలోకి వస్తే 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

SMTV Desk 2019-03-29 15:30:57  jobs, janasena

జనసేన పార్టీ అధికారంలోకి వస్తే 3లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో జనసేనాని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ…. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోరుకుంటోందన్నారు. విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్స్ పంపిణీ చేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి 6-10 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే రైతు పెన్షన్ అమలు చేస్తామన్నారు.