వైసీపీలోకి ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ

SMTV Desk 2019-03-28 19:12:27  ysrcp, chinnikrishna

వైసీపీలోకి సినీ లసలు కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ వైసీపీలో చేరారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వైసీపీ ప్రచార సభలో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జగన్. చిన్నికృష్ణను జగన్‌ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిన్ని కృష్ణ వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. ఆయనతో పాటు కోవూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చిన్నికృష్ణ ఇటీవలే వైసీపీకి మద్దతు పలికారు. మెగా ఫ్యామిలీతో ఇండస్ట్రీకి ఒరిగిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్‌కు ఏపీ ప్రజలంతా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. జగన్‌, కేసీఆర్‌లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా తెలంగాణలో ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసుంటున్నారని వాళ్ల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. పవన్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హైదరాబాద్‌లో తమ మీద దాడులు జరిగితే.. పవన్ వచ్చి కాపాడతారా అని ప్రశ్నించారు.