బలం పెంచుకుంటున్న దేవినేని

SMTV Desk 2019-03-27 13:12:50  devineni avinash

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గరం గరంగా మారింది. విమర్శల హోరు, ప్రచారాల జోరుతో రసవత్తర రాజకీయం నడుస్తుంది. టీడీపీ పార్టీ నుంచి యువనాయకుడు దేవినేని అవినాష్ వైసీపీ నేత కొడాలి నాని తో పోటీకి తల పడుతున్నారు. ఇద్దరు నాయకులు గెలిచేందుకు కసిగా పోరాడుతున్నారు. రణక్షేత్రంలో భీకర పోరుతో యావత్ రాష్ట్రా ప్రజల చూపును తమ వైపు తిప్పారు. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్న కొడాలి నాని గత మూడు దఫాలుగా విజయం సాధిస్తూ వచ్చారు. అలాంటి బలమైన నేత ఢీ కొట్టేందుకు టీడీపీ పార్టీ వ్యూహాలు రచించి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్ ను రంగంలో దింపారు. దేవినేని అన్ని విధాల సన్నద్ధం చేసి నాని పై బాణంలా ఎక్కుపెట్టింది టీడీపీ పార్టీ.

రాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ నేత కొడాలి నాని, టీడీపీ తరుపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 లో ఎన్నికలో ఎనిమిది వేల ఓట్ల పైచిలతో అప్పటి తన ప్రత్యర్థి రావి వెంకటేశ్వరరావు పై గెలుపొందారు. టీడీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. నాని పై గెలుపు కోసం టీడీపీ స్థానిక నాయకులను అందరిని పక్కన పెట్టీ ఆర్థిక అంగ బలంలో ధీటైన అభ్యర్థిగా భావించి దేవినేని అవినాష్ కు టికెట్ ఇచ్చింది. అవినాష్ కు టికెట్ ఇచ్చే ముందు అక్కడి నుండి పోటీ చేయాలనుకున్న సీనియర్ నేతలందరినీ బుజ్జగించారు. ఎన్టీఆర్ సొంత గడ్డగా భావించే గుడివాడలో ఈసారి టీడీపీ జెండా ఎగురవేయలని భావిస్తున్నారు. అయితే కొడాలి నాని మాత్రం గెలుపు కోసం తన బలగాన్ని సమీకరిస్తున్నారు. వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినాతన గెలుపును అడ్డుకోలేరని ఢంకా బజాయించి చెబుతున్నారు. ఎవరికి వారు వాళ్ళ బలాలను పెంచుకుంటూ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అయితే ప్రజలు ఎవరి వైపు అడుగులు వేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయితే వీరిలో కాస్త అవినాష్ ఎంట్రీ వలన ఊపు వచ్చింది దీంతో ఈసారి గుడివాడలో గెలుపు టీడీపీదే అని అభిమానులు ఢంకా భజాయించి చెబుతున్నార. కొన్ని రోజులుగా అవినాష్ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ.. ఓ సత్రంలా అన్నదానం చేస్తున్నారు. అది గమనించిన నాని.. వెంటనే ఎన్నికల కోడ్ అన్నఅడ్డంకితో దాన్ని మూసేయించేంత వరకు నానీ నిద్రపోలేదంటే నానీకి ఓటమి భయం ఏ స్థాయిలో పట్టుకుందో అర్థమౌతుంది.