లోకేష్ నామినేషన్‌‌పై అభ్యంతరాలు?

SMTV Desk 2019-03-26 18:38:40  Nara Lokesh, Nomination

మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో.. ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉందని పేర్కొన్నారు…నోటరీ చేసింది మాత్రం కృష్ణాజిల్లాకు చెందిన లాయర్ సీతారామ్.. గుంటూరు జిల్లా తన పరిధిలోకి రానప్పుడు సీతారామ్ ఎలా నోటరీ చేస్తారని వైసీపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నోటరీపై సమాధానం చెప్పాలని నిలదీయగా.. వివరణ ఇచ్చేందుకు లోకేష్‌ తరపు న్యాయవాది సీతారామ్‌ ఎన్నికల అధికారిని కొంత సమయం అడిగారు.

నోటరీ రూల్స్ ప్రకారం లోకేష్ నామినేషన్ చెల్లదని వైసీపీ నేతలు అంటున్నారు. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటరీ వ్యవహారంపై లోకేష్, ఆయన తరపు లాయర్లు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే నామినేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఉంది. మరోవైపు నోటరీ వ్యవహారం చిన్న పొరపాటని.. తప్పుకానే కాదని వాదిస్తున్నారు. నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదంటున్నారు.