భీమవరం లో పవన్ గెలుస్తారా?

SMTV Desk 2019-03-26 16:53:22  Bhimavaram, Pawan kalyan

ఇది ఎండాకాలం వేడి మాత్రమే కాదు.. ఏపీలో రగులుతున్న రాజకీయ వేడి కూడా. ఏపీలో ప్రధానంగా పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే అని అంతా అనుకుంటున్నారు. కానీ.. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అసలు పోటీలోనే లేదంటున్నాయి ఫ్లాష్ సర్వేలు.

అయితే.. టీడీపీ, వైసీపీ కాకుండా… పవన్ జనసేన ఈసారి ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. జనసేన మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేయడం, మరోవైపు అధికార టీడీపీ, ప్రతిపక్షపార్టీ వైఎస్సార్సీపీ ఒత్తిడిని తట్టుకొని నిలబడుతుందా? అని అంతా అనుకున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువాక నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భీమవరంలో పోటీ ఎలా ఉంది? భీమవరంలో త్రిముఖ పోటీ ఉందా? లేక ద్విముఖ పోటీ ఉందా? అసలే పోటీ చేయక చేయక పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. అసలు పవన్ పోటీ ఇస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఏపీ ప్రజలకు కలుగుతాయి.అందుకే భీమవరానికి సంబంధించి ఓ ఫ్లాష్ సర్వే బయటికి వచ్చింది. వైసీపీ అధినేత గ్రంథి శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్యే పోటీ అట. టీడీపీ అభ్యర్థి జాడపత్తలో కూడా ఉండడట.వీళ్లిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ అట. అయితే… ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు మాత్రం గ్రంథి శ్రీనివాస్ కే ఉన్నాయని సర్వే చెబుతోంది. అయితే.. ఆయనకు అంత మెజారిటీ రాకున్నా.. భీమవరం ప్రజలు గ్రంథినే గెలిపిస్తారని ఆ సర్వే చెబుతోంది. మరి… నిజంగా అక్కడ గ్రంథి గెలుస్తారా? లేక పవన్ గెలుస్తారా? అసలు భీమవరంలో ఏం జరగబోతోంది.. అనే విషయాలు తెలియాలంటే మే 23 దాకా ఆగాల్సిందే.