వైఎస్సార్‌సీపీ లోకి మోహన్ బాబు .. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.

SMTV Desk 2019-03-26 13:29:08  Mohan Babu,

హైదరాబాద్ : శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్, నటుడు మోహన్ బాబు ఇవాళ వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ సమక్షంలో మోహన్‌బాబు వైసీపీలో చేరారు. మోహన్‌బాబుకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ గెలుస్తుంది. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. పదవి కోసం వైసీపీలో చేరలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లించాలని చంద్రబాబును ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోలేదు. వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు మంచి చేస్తున్నాడు.. చేయబోతున్నాడని తెలిసి వైసీపీలో తాను చేరానని మోహన్‌బాబు స్పష్టం చేశారు.