విందు భోజనాన్ని స్వీకరించిన జనసేనాని

SMTV Desk 2019-03-25 18:24:44  Vindhu Bhojanam, janasena

ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. క్షణక్షణం మారిపోతున్న ఈ రాజకీయాల్లో భాగంగా ప్రచారం హోరెత్తిపోతుంది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా ప‌ర్యట‌న‌లో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా జ‌న‌సేన అభ్యర్ధిగా బరిలోకి దిగిన షేక్ జియా ఉర్ రెహ్మాన్ ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా రెహ్మాన్ త‌ల్లి.. ఇస్లాం మ‌త గ్రంథాన్ని చ‌దివి వినిపించ‌గా.. జనసేనాని పరవశించిపోయి.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా ఆమె సోపాలో కూర్చొని గ్రంథాన్ని చదివి వినిపిస్తుండగా... నేలపై కూర్చున్న పవన్.. ఆమె చేతికి ఆప్యాయంగా ముద్దులు పెట్టారు. ఆమె పాదాలను తాకి నమస్కారం చేసుకున్నారు. ఆతర్వాత రెహ్మాన్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని స్వీకరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.