నా తొలి సంతకం దాని పైనే ..

SMTV Desk 2019-03-23 16:50:27  Janasena, Pawan Kalyan, Farmer

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఎన్నికలు దగ్గరకి వస్తుండడంతో నామినేషన్ అనంతరం తన ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతంగా తీసుకెళ్తున్నారు.వారి పార్టీ బలంగా ఉన్న ప్రతీ చోట్లా మళ్ళీ మళ్ళీ సభలు నిర్వహించి శరవేగంగా దూసుకుపోతున్నారు.ఇదే సందర్భంలో పవన్ ఈ రోజు నూజివీడులో తన సభను ఏర్పాటు చేసారు.ఈ సభలో పవన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీయే ప్రభుత్వం స్థాపించనుంది అని తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.ఇదే సమయంలో తాను ముఖ్యమంత్రి అయిన అనంతరం తాను పెట్టబోయే మొదటి సంతకం కోసం కూడా ఒక క్లారిటీ ఇచ్చారు.

తాను మొదటి నుంచి రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తానని పవన్ చెప్పుకొచ్చేవారు,ప్రతిపక్షంలో ఉండేటటువంటి నేతలు అసెంబ్లీకి వెళ్లకపోయినా సరే వారికి జీతభత్యాలు వస్తున్నాయి కానీ నిరంతరం కష్టపడే రైతులకి మాత్రం ఎలాంటి సహాయం అందడం లేదని తెలిపారు.అందుకోసమే రైతుల కోసం తన పార్టీ మ్యానిఫెస్టోలో ఎలాంటి రైతులకి అయినా సరే నెలకి 5వేల రూపాయలు పింఛను ఇస్తానని తెలిపారు.జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించాక తన మొట్టమొదటి సంతకం రైతులకు 5వేల రూపాయల పింఛను పైనే ఉంటుందని తెలిపారు.అంతే కాకుండా వ్యవసాయ అవసరాల కోసం 8వేల రూపాయలు ఇస్తానని తెలిపానని దానిపై కూడా సంతకం చేస్తాని పవన్ క్లారిటీ ఇచ్చారు.