కెసిఆర్ కు సవాల్ విసిరినా రేవంత్ రెడ్డి

SMTV Desk 2019-03-23 16:43:01  kcr, jagan, revanth reddy

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయ నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు సర్వసాధారణం అని సంగతి అని అందరికీ తెలిసినదే..అలాగే ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికలు అలాగే తెలంగాణాలోని పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలయ్యింది.

ఇదే సందర్భంలో టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి తెరాస ముఖ్యమంత్రి కెసిఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు,చంద్రబాబు ఇక్కడ రాజకీయాల్లో కలగజేసుకున్నందుకు కెసిఆర్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కలుగజేసుకుంటానని ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయ వర్గాల్లో ఎంతటి చర్చకు దారి తీసిందో అందరికీ తెలుసు.అందులో భాగంగానే కెసిఆర్ సర్కారు ఇక్కడ వై ఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు.

ఈ విషయం పైనే రేవంత్ కెసిఆర్ కు ఒక సవాలు విసురుతున్నారు.చంద్రబాబు ఇక్కడకొచ్చి గల్లీ గల్లీ తిరిగారు..అదే విధంగా కెసిఆర్ నిజంగా ధైర్యవంతుడు అయితే చిత్త శుద్ధి ఉంటె జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ కి వెళ్లి ఏ గుంటూరులోనో అమరావతిలోనో లేక గుంటూరులోనో మీటింగు పెట్టమనండి చూద్దాం అంటూ సవాలు విసిరారు.