మార్పు కావాలని యువతకు సీట్లు కేటాయిస్తున్నారు

SMTV Desk 2019-03-21 16:05:25  Janasena,

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల నాయకులతో పోల్చితే కాస్త తక్కువ వయసులోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పాలి.అలా రావడంతోనే భవిష్యత్తులో రాబోయే తరాలకి మంచి బాట వేయాలంటే ఇప్పటి నుంచే వారికి దిశా నిర్దేశం చేసేందుకు యువ రక్తం కావాలని అంటూనే తన పార్టీ తరపు నుంచి యువతకు అవకాశాన్ని కల్పిస్తానని చెప్పారు.ఇప్పుడు అదే బాటలో చాలా మందికే తన పార్టీ నుంచి సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన 30 ఏళ్ల లోపు యువతకే పెద్ద పీట వేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఇక్కడే అసలు సమస్య జనసేనకు ఎదురవుతుంది.అదేమిటంటే పవన్ యువతకు అందులోను వారి ప్రాంతంలో కుటుంబానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా పెద్దగా లేనటువంటి యుక్త వయస్కులకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తున్నారు.ఇది హర్షణీయమైన అంశమే కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వీరు ఎంత వరకు నెట్టుకు రాగలరు.ఇతర పార్టీల ఒత్తిడులను అధిగమించి ప్రచారం చేసి ఎమ్మెల్యేగా గెలిచి రేపు జనసేనను అధికారం వరకు తీసుకెళ్లగలరా అని ఒక ప్రశ్న లేవనెత్తుతుంది.

ఈ రోజే తాజాగా మరో సాధారణ యువకునికి ఎమ్మెల్యే టికెట్ పవన్ ఇచ్చారు.విజయనగరం జిల్లా పార్వతి పురం నుంచి గౌరీ శంకర్ అనే యువకునికి పవన్ టికెట్ కేటాయించినట్టు తెలిపారు.ఇదిలా ఉండగా అతని యొక్క తండ్రి సామాన్య రైతు అయితే అతని యొక్క తల్లి కూరగాయలు అమ్మి జీవనం కొనసాగిస్తారు.ఇప్పుడున్నా ఈ డబ్బు రాజకీయ వ్యవస్థలో పవన్ మార్పు కావాలని యువతకు సీట్లు కేటాయిస్తున్నారు.మరి వీరు ఎంతవరకు పవన్ ను అతని పార్టీ జనసేనను ఏ విధంగా గెలిపిస్తారో చూడాలి.