అంబ‌టి శ్రీహ‌రిప్ర‌సాద్ టీడీపీకి రాజీనామా

SMTV Desk 2019-03-20 16:14:33  Amabati Srihariprasad,

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌వైపు ఎన్నిక‌లు ముంచుకొస్తుంటే.. మ‌రోవైపు తెలుగుదేశం పార్టీకి మాత్రం వ‌రుస‌గా దెబ్బ మీద దెబ్బ ప‌డుతోంది. ఒక‌వైపు ఎంపిక చేసిన అభ్య‌ర్ధులు జంప్ అవుతున్నారు, మ‌రికొంద‌రు పోటీ చేయ‌లేమ‌ని చేతులెత్తేస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు త‌ల‌పోటుగా మారింది.

అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే మ‌రో కీల‌క నేత పార్టీకి రాజీనామా చేయ‌డం టీడీపీ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేపుతోంది. అవ‌నిగ‌డ్డ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబ‌టి శ్రీహ‌రిప్ర‌సాద్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 2014లో త‌న‌కు కాద‌ని, బుద్దా ప్ర‌సాద్‌కు టిక్కెట్ ఇచ్చిన చంద్ర‌బాబు, త‌న‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తాన‌ని చెప్పి మోసం చేశార‌ని అంబ‌టి శ్రీహ‌రి ప్ర‌సాద్ తెలిపారు.

ఇక ఎన్నో ఏళ్ళుగా పార్టీకి ఎంతో కీల‌కంగా సేవ‌లు చేస్తున్న త‌మ‌కు గుర్తింపు రానివ్వ‌కుండా చంద్ర‌బాబు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతోనే టీడీపీని వీడుతున్న‌ట్లు అంబ‌టి శ్రీహ‌రి ప్ర‌సాద్ తెలిపారు. ఇక వైసీపీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని శ్రీహ‌రి తెలిపారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుండి కృష్ణా జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బ్రాహ్మ‌ణ‌య్య వార‌సుడు అంబ‌టి శ్రీహ‌రి. మ‌రి అలాంటి వారు టీడీపీని వీడ‌డంతో టీడీపీకి పెద్ద షాకే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున‌నారు.