గుంటూరు వెస్ట్ నుంచి మాధవీలత పోటీ

SMTV Desk 2019-03-20 13:14:35  Guntur west, Madhavilatha,

అమరావతి, మార్చ్ 19: నచ్చావులే.. అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత గుర్తుందా మీకు. ఆమెకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె గత కొన్ని రోజుల క్రితమే బీజేపీలో చేరారు. తాజాగా… ఆమెకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఇచ్చింది బీజేపీ.ఈ క్రమంలో బీజేపీ పార్టీ ఆదివారం ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో మాధవీలత పేరు కూడా ఉంది.

ఆమె అసలు పేరు పసుపులేటి మాధవి. ఆమెది కర్నాటకలోని బళ్లారి. ఆమె తల్లిదండ్రులు తెలుగు వాళ్లే. కానీ.. బళ్లారిలో సెటిల్ అయ్యారు. మాధవీలత చదువంతా బళ్లారిలోనే జరిగింది. తర్వాత నచ్చావులే ఆడిషన్స్ లో సెలక్ట్ అయి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

గుంటూరు వెస్ట్ నుంచి వైసీపీ తరుపున చంద్రగిరి ఏసురత్నం పోటీ చేస్తుండగా.. టీడీపీ నుంచి మద్దాళి గిరి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాధవీలత పోటీ చేస్తోంది. అయితే.. ఈ నియోజకవర్గంలో పోటీ నువ్వా.. నేనా అన్నట్టుగా ఉంది. మరి.. చూద్దాం మాధవీలత సినీ గ్లామర్ ఏమేరకు తనకు ఉపయోగపడుతుందో?