పేద, మధ్య తరగతి కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నా

SMTV Desk 2019-03-20 13:09:11  ys Jagan, Jagan Mohan reddy

అమరావతి, మార్చ్ 19: ఏపీలో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ కడప జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని రాయచోటిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గన్న జగన్ ఈ సందర్భంగా ఆడపడుచులకు కానుకల వర్షం కురిపించారు.

పేద, మధ్య తరగతి కుటుంబాలకు నేను భరోసా ఇస్తున్నా. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగు సార్లు 75 వేల రూపాయలు ఇస్తాం. డ్వాక్రా మహిళలకు ఎంత రుణం ఉన్నా నేరుగా చెల్లిస్తాం.

పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకున్నా. ఏపీలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి. అదే నాకోరిక. మీకు నేను ఉన్నా అనే భరోసాను ఇస్తున్నా. రైతుల కష్టాలు తీరాలంటే.. పిల్లలకు ఫీజలు చెల్లించాలంటే వైసీపీ అధికారంలోకి రావాలి. చంద్రబాబు మాటలను నమ్మకండి. పదవుల కోసం చంద్రబాబు ఏదైనా చేస్తారు. ఈ యుద్ధం.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతోంది.. కడప స్టీల్ ప్లాంట్ లేదు. ఏదీ లేదు. అది వచ్చి ఉంటే 10 వేల ఉద్యోగాలు వచ్చి ఉండేవి.. కానీ.. చంద్రబాబుకు ఇవేమీ పట్టవు.. అని జగన్.. చంద్రబాబుపై మండిపడ్డారు.