వైఎస్‌ వివేకానందరెడ్డిది హత్యే...శరీరంపై ఏడు చోట్ల కత్తిగాట్లు

SMTV Desk 2019-03-15 18:38:09  ys vivekananda reddy, YSR Congress party, former Andhra Pradesh Chief Minister YS Rajashekhara Reddys

కడప, మార్చ్ 15: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి చెందడంపై అనేక అనుమానాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఆయనది హత్యేనని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌‌లో వెల్లడైంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ పూర్తైన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహన్ని పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. శుక్రవారం నాడు వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహానికి నిర్వహించిన పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగు చూసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. వివేకానందరెడ్డి శరీరంపై సుమారు ఏడు చోట్ల కత్తిగాట్లు ఉన్నట్టుగా పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలినట్టుగా పోలీసులు వెల్లడించారు.