భార్యా భర్తల మధ్య మనస్పర్థలు .. ఆపై ..

SMTV Desk 2019-03-15 12:17:35  Suicide,

సూర్యాపేట : మేళ్ళ చెరువు మండలం వెల్లటూరు కాలనీ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ, ఆమె ఇద్దరు కుమారులు కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన రసూల్, సలోమీ దంపతులు కొంతకాలంగా వెల్లటూరు కాలనీ లో ఉంటున్నారు. వీరికి బిలిగ్రాం (6) విలియం కేర్ (4) అనే కొడుకులు ఉన్నారు. రసూల్ మత గురువుగా పని చేస్తున్నారు. కొంతకాలం క్రితం భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న సలోమీ కూల్ డ్రింక్ లో ఎలుకల మందు కలిపి తాగింది. అంతేకాకుండా తన కొడుకులకు కూడా తాగించింది. వారిని ఖమ్మం హాస్పిటల్ కు తరలించారు. మార్గ మధ్యలో ఒక బిలిగ్రామం మృతి చెందగా తల్లి , మరో కుమారుడు చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాలను ఖమ్మం నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తన్నట్టు పోలీసులు తెలిపారు.