చిత్తూరులో రూ.1.09 కోట్ల నగదు పట్టివేత

SMTV Desk 2019-03-14 13:08:11  cash, indian cash, chittor

చిత్తూర్, మార్చ్ 14: ఎన్నికలు సమీపిస్తున్న వేళ చిత్తూరు జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. వడమాలపేట టోల్‌ ప్లాజా దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో టాటా ఏస్‌ లో తరలిస్తున్న రూ.1.09 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు క్రికెట్ కిట్లను పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ నగదు పట్టుబడింది. తమిళనాడు నుంచి తిరుపతి తరలిస్తుండగా పోలీసులు వీటిని పట్టుకున్నారు.