ఆంధ్రప్రదేశ్‌ లో ఏప్రిల్‌ 11న శాసనసభ ఎన్నికలు

SMTV Desk 2019-03-11 10:05:32  elections,

17వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ భాగంగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ను కూడా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్‌ లో ఏప్రిల్‌ 11న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 175 నియోజకవర్గాల్లో తొలివిడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడతాయి.

ఇక పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్‌ లో మరియు తెలంగాణలోనూ ఒకేరోజూ అనగా ఏప్రిల్‌ 11వ తేదీన నిర్వహించబోతున‍్నట్లు సీఈసీ సునీల్‌ ఆరోరా వెల్లడించారు.

ఎన్నికల షెడ్యూల్ వివరాలు:

మందుగా ఊహించినట్టు 9 దశల్లో కాకుండా 7 దశల్లోనే ఎన్నికలు జరుగనున్నాయి

తొలి దశ: పోలింగ్ ఏప్రిల్ 11 -ఏపీ, తెలంగాణ సహా మరో 22రాష్ట్రాల్లో జరగనున్నాయి

రెండో దశ: ఏప్రిల్ 18 – కర్ణాటక, మణిపూర్, రాజస్థాన్, త్రిపుర

మూడో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 23 – అసోం, ఛత్తీస్ గఢ్

నాలుగో దశ: పోలింగ్ తేదీ ఏప్రిల్ 29 – జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా

ఐదో దశ: పోలింగ్ తేదీ మే 6 – జమ్మూ కాశ్మీర్

ఆరో దశ: పోలింగ్ తేదీ మే 12 – బీహార్, హర్యాన, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ

ఏడో దశ: పోలింగ్ తేదీ మే 19 – బీహార్, యూపీ , పశ్చిమ బెంగాల్