కేఏ పాల్ కు ఈసీ షాక్...!

SMTV Desk 2019-03-10 11:45:55  KA Paul, Election Commission, YV Subbha Reddy, Helicopter, Fan, Polls

అమరావతి, మార్చి 10: ప్రముఖ మత ప్రచారకర్త, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు చెడు అనుభవం ఎదురైంది. ఎన్నికల సంఘం అతనికి షాక్ ఇచ్చింది. తన పార్టీ హెలికాప్టర్ ను మార్చాలని ఈసీ తెలిపింది. హెలికాప్టర్ తమ ఫ్యాన్ గుర్తును పోలి ఉండడంతో ఓటర్లు పొరబడే అవకాశం ఉందని, కాబట్టి దానిని తొలగించి, ఆ స్థానంలో వేరే గుర్తును కేటాయించాలంటూ వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఈసీ ప్రజాశాంతి పార్టీకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సంఘటనపై స్పందించిన కేఏ పాల్, వైసీపీపై మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడైనా ఫ్యాన్, హెలికాప్టర్ గుర్తులు ఒకేలా ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ రెండింటి మధ్య తేడాను ఓటర్లు గుర్తించగలరని అన్నారు. కాబట్టి తమకు తొలుత కేటాయించిన గుర్తునే కొనసాగించాలని ఈసీని కోరారు. అయితే, హెలికాప్టర్ గుర్తును పక్కనపెట్టి మరో గుర్తును కేటాయించేందుకే ఈసీ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.