బాలకృష్ణకు దీటుగా మైనార్టీ అభ్యర్థి

SMTV Desk 2019-03-09 16:02:50  Jaganmohan Reddy, Iqbal Ahmed, Balakrishna, Minority, Hindupuram, MLA

అమరావతి, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. పార్టీ అధినేతలు కీలక నియజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సినీ నటుడు బాలకృష్ణ నియోజకవర్గం అయిన హిందూపురంపై గురి పెట్టారు. బీసీలతో పాటు మైనార్టీలకు మంచి పట్టున్న ఈ ప్రాంతంలో టీడీపీని ఎదుర్కోనేందుకు రిటైర్ట్ పోలీస్ అధికారి ఇక్బాల్ అహ్మద్‌ను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

అయితే గతంలో కూడా మైనార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీని బాలయ్యపై ప్రయోగించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. కానీ ఘనీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, చురుగ్గా ఉండకపోవడంతో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిలిచిపోయాయి. మైనార్టీ అయినప్పటికీ స్థానికంగా ఆర్ధిక, అంగబలం వున్న వారిని రంగంలోకి దింపేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఇక్బాల్ అహ్మద్ పేరు అనూహ్యంగా తెర మీదకు వచ్చింది.