రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ సంచలన కామెంట్స్

SMTV Desk 2017-08-06 18:15:17  TDP MLC ADI REDDY APPARAO SHOCKING COMMENTS ON ROJA

హైదరాబాద్, ఆగస్ట్ 6 : టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంచలమైన కామెంట్స్ చేశారు. ఈటీవిలో వచ్చే జబర్దస్త్ లాంటి కార్యక్రమాలకు జడ్జిగా చేస్తూ, మహిళలు సిగ్గుపడేలా మాట్లాడడం సిగ్గుమాలిన పని అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసలు నువ్వా ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించేది? నీ క్యారెక్టర్ ఏంటి అని నిన్ను నువ్వు తెలుసుకొని మాట్లాడు? టీడీపీ మహిళల దెబ్బకు నీకు దిమ్మ తిరిగిపోతుంది అంటూ విమర్శలు గుప్పించారు. తన పద్ధతి మార్చుకోవాలని అలా కాకుండా అనవసరంగా చంద్రబాబు, లోకేష్ పై లేని పోనివి చెప్తే జనాల్లో తిరగలేవు అంటూ హెచ్చరించారు.