వైసీపీకి 92 అసెంబ్లీ స్థానాలు వస్తాయి : తెరాస

SMTV Desk 2019-03-08 12:20:33  YSRCP,

అమరావతి, మార్చ్ 08: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్ర శేఖర్ రావు గారు ఏపీలో రానున్న ఎన్నికలకి సంబంధించి అక్కడ సర్వే కూడా నిర్వహిస్తున్నారంట. ఎన్నికల తరువాత ఎవరో విజయం సాధిస్తారో, ఎవరు ఓటమిని చూస్తారో అని ఇప్పటికే తెరాస కి తెలిసిపోయిందని సమాచారం. తమ మద్దతు ఎప్పుడు కూడా వైసీపీ కె ఉంటుందని తెరాస ఇప్పటికే పలుమార్లు ప్రకటించగా, అధికార టీడీపీ ని ఓడించడానికి సర్వదా ప్రయత్నిస్తామని తెరాస ప్రకటించింది. అందుకు సంబంధించి ఏపీలో తెరాస సర్వేలు కూడా చేపట్టింది. ఆ సర్వే ఫలితాలను కూడా వెల్లడించింది. రాష్ట్రంలో ఉన్న పార్టీలలో, ఎవరికీ ఆధిక్యత ఉంటుంది అనేదానిమీద కూడా సర్వే చూపించమని చెబుతున్నారు.

తెరాస జరిపినటువంటి సర్వేల ఫలితాల ప్రకారం ఏపీలో వైసీపీకి 92 అసెంబ్లీ స్థానాలు వస్తాయని, అధికార టీడీపీకి 70 సీట్లకు మించి రావని తెలిపింది. కాగా కొత్త పార్టీ అయినటువంటి జనసేన కేవలం 13 స్థానాలకే పరిమితమవుతుందని సర్వేలో తేలినట్లు సమాచారం. ఇంతకుముందు వైసీపీకి 100 సీట్లు వస్తాయని అనుకున్నారు కానీ ఇటీవల టీడీపీ ప్రవేశపెట్టిన కొన్ని కొత్త పథకాల ద్వారా అధికార పార్టీ పరిస్థితి కాస్త బాగుపడిందని సమాచారం. కాగా చంద్రబాబు చేయనటువంటి మోసపూరిత చర్యల ద్వారా టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతుందని, ఈసారి టీడీపీ అధికారంలోకి రాదని తెరాస సర్వే తేల్చేసింది.

ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలైన జనసేన, బీజేపీ, కాంగ్రెస్ మాత్రం రానున్న ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపవని తెలుస్తుంది. ఒకవేళ వీరు కూడా అక్కడ కూటమి తరహాలో ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం ఇంకొన్ని స్థానాలు పెరుగుతాయని అంచనా… కానీ ఈసారి ఏపీలో అధికారంలోకి రాబోయేది వైసీపీ పార్టీ అని తెరాస సర్వే చెప్పకనే చెబుతుంది…