ఘర్షణలో పాఠశాల విద్యార్ధి మృతి

SMTV Desk 2017-08-06 14:38:46  School students fighting, Vizag Madhuranagar school students fight, 10th class Boy death because of fighting with 8th class boy

విశాఖ, ఆగష్ట్ 6: మధురానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగా ఒక బాలుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్ధి చిన్నా విరామ సమయంలో ఎనిమిదో తరగతి గది ముందు నిల్చుని తన మిత్రులతో మాట్లాడుతుండగా, ఎనిమిదో తరగతి విద్యార్థి అక్కడకి వచ్చి మా తరగతి గది దగ్గరకు నువ్వు అమ్మాయి కోసమే వచ్చావంటూ ఘర్షణకు దిగాడు. అక్కడితో ఆగిపోకుండా పాఠశాల పూర్తయిన తర్వాత తన స్నేహితులతో కలిసి దాడి చేశాడు. చిన్నాను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో చిన్నా మృతికి కారణమైన ముగ్గురు 8వ తరగతి విద్యార్ధులను ద్వారకా నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.