విషాదాంతంగా ముగిసిన సూర్యకుమారి మిస్టరీ

SMTV Desk 2017-08-06 14:18:14  SURYAKUMAARI DEAD MYSTERY

విజయవాడ, ఆగస్ట్ 6 : ఐదు రోజుల క్రితం అదృశ్యమైన డా. సూర్యకుమారి మిస్టరీ విషాదాంతంగా మిగిలిపోయింది. కన్న వాళ్లకు కడుపుకోత మిగిల్చి కానరాని లోకాలకు కదలిపోయింది. తన స్కూటీ రైవ‌స్ కాలువ‌లో ల‌భ్యం కావ‌డంతో ఎన్‌డీఆర్ఎఫ్‌, పోలీసులు బృందాలు గాలింపు చర్యలు చేప‌ట్టగా కూన‌కుంట్ల లాకుల వ‌ద్ద మృతదేహం లభ్యమైంది. సూర్యకుమారి మృతదేహానికి విజయవాడ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సూర్యకుమారి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. కాగా ఈరోజు సాయంత్రం మైలవరం మండలంలోని గడ్డమడుగులో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.