వైసీపీ అధినేత జగన్‌కు షోకాజ్‌ నోటీసులు

SMTV Desk 2017-08-06 11:36:38  collector Notice to jagan, namdyala collector notice to jagan,

నంద్యాల, ఆగష్ట్ 6: నంద్యాల బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేగుతుంది. తాజాగా జగన్ వ్యాఖ్యలపై తెదేపా నేతలు ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో ఈసీ ఆదేశాలపై జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జగన్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ 24 గంటల్లోపు సమాధానం చెప్పాలని నోటీసులో కలెక్టర్‌ స్పష్టం చేశారు. దీనిపై వైసీపీ పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.