మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం

SMTV Desk 2019-03-06 18:55:27  ap assembly, tdp mla, modugula venugopal reddy, resigned in tdp, ysrcp

అమరావతి, మార్చ్ 06: గుంటూరుపశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మంగళవారం తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వేణుగోపాల్ రెడ్డి రాజీనామాను ఆమోదించారు. ఆ రాజీనామా లేఖలో తన వ్యక్తిగత కారణాలతోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తరువాత ఈయన మార్చి 9న వైసీపీలో చేరనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్ సభ లేదా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.