మోదీ బెదిరింపుల‌కు నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాదు

SMTV Desk 2019-03-05 12:22:29  modi, galla jayadev

గుంటూరు టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ మ‌ళ్లీ మోదీపై విరుచుకుప‌డ్డారు. లోక్‌స‌భ‌లో టీడీపీ ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం ద‌గ్గ‌రి నుంచి మోదీ న‌న్ను టార్గెట్ చేశార‌ని, ఇందులో భాగంగానే త‌న‌పై, త‌న‌కు సంబంధించిన సంస్థ‌ల‌పై ఐటీ దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారని మండిప‌డ్డారు. మోదీ ఆదేశ మేర‌కే ఈడీ అధికారులు నాపై క‌క్ష సాధిస్తున్నార‌ని, రెండు గంట‌ల పాటు సోదాలు నిర్వ‌హించి అనైతికంగా ప్ర‌వ‌ర్తించారని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.ఇటీవ‌ల జ‌రిగిన బ‌డ్జెట్ ప్ర‌సంగం అనంత‌రం త‌న‌పై మోదీ మ‌రోసారి ఐటీ దాడులు చేయించార‌ని, త‌న వ‌ద్ద ఏమీ ల‌భించ‌క‌పోవ‌డంతో బంధువుల‌ను మాన‌సికంగా హింసించ‌డం మొద‌లుపెట్టార‌ని మండిప‌డ్డారు. మోదీ బెదిరింపుల‌కు నేను భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాద‌ని, అవ‌ర‌మైతే జైలుకైనా వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌ని బీజేపీ నేత‌ల‌పై, ప్ర‌ధాని మోదీపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌ధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా, జాతీయ బ‌ద్ర‌తా మండ‌లి స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ఈ ముగ్గ‌గూ క‌లిసి దేశంలో హిట్ల‌ర్ పాల‌న‌ను న‌డిపిస్తున్నార‌ని మండిపడ్డారు.