800కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు

SMTV Desk 2019-03-02 17:58:09  Drugs, Srikakulam, Knachili district, Illegal transport of drugs

శ్రీకాకుళం, మార్చ్ 2: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారి వద్ద శనివారం అక్రమంగా భారీగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కంచిలి, సోంపేట మధ్య దారిలో పోలీసులు వాహనాల తనిఖీలను చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒడిశా నుంచి రాంచీకి వెళ్తున్న ఓ డిసిఎం వ్యాన్‌ ను తనిఖీ చేయగా అందులో నుండి 20 బస్తాల గంజాయి బయటపడింది. ఆ బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి బస్తాలు సుమారు 800 కిలోలు ఉండవచ్చని పోలీసుల అంచనా.