చిక్కుకుపోయిన చిరుత పులి

SMTV Desk 2019-03-02 15:24:59  Annathapuram, Forest officers, tiger

అమరావతి, మార్చి 02: అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని కోనాపురం గ్రామంలో పొలం చుట్టూ రైతు ఏర్పాటు చేసిన ఇనుప కంచెకు చిక్కుకున్న చిరుతపులి బాధతో విలవిల్లాడింది. గ్రామానికి చెందిన రైతు వెంకటనారాయణ తన పొలం చుట్టూ ఇనుపు ముళ్ల కంచెను ఏర్పాటు చేశాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లిన రైతుకు కంచెకు చిక్కుకుని అరుస్తున్న చిరుత కనిపించింది. దీంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది.

దీంతో గ్రామస్తులు వెంటనే పోలీసులకు అటవీ శాఖా అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను బంధించి పెనుకొండ అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. దాని వయసు ఏడాది ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రథమ చికిత్స అనంతరం దానిని తిరుపతి జూకు తరలించినట్టు చెప్పారు.