ఫత్వా ను సైతం లెక్క చెయ్యని జలీల్‌ఖాన్‌, షబానా ఖాతూన్‌

SMTV Desk 2019-02-27 16:34:03  Jalil Khan, Mallika Begam, Shabhana Khathun, Phathva, Elections

అమరావతి, ఫిబ్రవరి 27: మాజీ మేయర్‌ మల్లికాబేగం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమార్తె షబానా ఖాతూన్‌ రాజకీయాల నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం పంజా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమవేశంలో మల్లికాబేగం మాట్లాడారు. 2009 ఎన్నికల సమయంలో ముస్లిం మహిళలు రాజకీయాలలోకి రాకూడదని జలీల్‌ఖాన్‌ కొంతమంది మతపెద్దలను ప్రోత్సహించి తనపై ఫత్వా జారీ చేయించారన్నారు. దీంతో ఆమె ఎన్నికల్లో ఓడిపోయానని పేర్కొంది. కాగా, జలీల్‌ఖాన్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ 2009లో మల్లికాబేగం ఆ ఫత్వాను గౌరవించలేదని వ్యాఖ్యానించారని, అందువలన తన కుమార్తె కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పారని మల్లికాబేగం గుర్తు చేశారు.

మల్లికాబేగం 2009లో కాంగ్రెస్ తరుపున పోటికి దీగారు. అయితే, బుర్కా ధరించకుండా ముస్లిం మహిళలు రాజకీయాల్లోకి రాకూడదంటూ ఆ మతపెద్దలపై ఒత్తిడి తెచ్చి జలీల్‌ఖాన్‌ ఫత్వా జారీ చేయించారు. ఈ ఫత్వా జారీ చేయడం వల్లనే తాను ఓడిపోయానని మల్లికాబేగం వెల్లడించారు. తాజాగా షబానా ఖాతూన్‌ ఏ విధంగా రాజకీయాల్లోకి వస్తారంటూ, ఫత్వా జారీ చేయాలంటూ మతపెద్దలపై మల్లికాబేగం ఒత్తిడి పెంచి విజయం సాధించారు. అయితే దీన్ని జలీల్‌ఖాన్, ఆయన కుమార్తె ఖాతూన్‌లు లెక్క చేయడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఫత్వా గురించి మాట్లాడిన జలీల్‌ఖాన్‌ ఇప్పుడు దాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారని, దానికి మత పెద్దలు ఏమి చర్యలు తీసుకుంటారని పలువురు ముస్లిం సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.