ఓ వైపు యాంకర్ రేణు దేశాయ్......మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-02-25 16:09:56  pawan kalyan, renudesai, janasena, sakshi

కర్నూలు, ఫిబ్రవరి 25: సినీ నటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆత్మహత్యకు పాల్పడిన రెండు రైతు కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా ఆమె సాక్షి టీవీ యాంకర్ పాత్రను పోషించడం ఆసక్తిగా మారింది.

ఓ వైపు పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే.. అదే జిల్లాలో రేణు దేశాయ్ కూడా సందడి చేస్తుండటం, అది కూడా సాక్షి టీవీ లోగో పట్టుకుని రైతులను ఇంటర్వూలు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీరుస్తుంది.

పవన్ కు పోటీగా రేణు దేశాయ్ ని వైసీపీ రంగంలోకి దించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. దీని వెనుక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందని అనుకుంటున్నారు. టీడీపీ, జనసేనలు చేతులు కలపబోతున్నాయని సాక్షి మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.