పవన్ కళ్యాణ్ పై మంచు హీరో ప్రసంసలు

SMTV Desk 2019-02-08 13:07:12  Manchu Manoj, Pawan Kalyan, Janasena

హైదరాబాద్, ఫిబ్రవరి 08: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీని పక్క ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని అన్ని విధాల శక్తివంతంగా తయారు చేస్తున్నారు. అన్ని పార్టీలలాగా ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలను కాకుండా మేధావులకు, విద్యావంతులకు పార్టీలో స్థానం కల్పిస్తున్నారు.

ఇటీవల బీవీ రాజు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణు రాజు, ఏపీజే అబ్దుల్ కలాం సైంటిఫిక్ సలహాదారు పోన్‌రాజ్, రిటైర్డ్ డీఐజీ రవికుమార్ మూర్తికి పార్టీలో ఉన్నత పదవులను కేటాయించారు. ఈ నేపథ్యంలో ప్రజాసేవ కోసం పలువురు విద్యావంతులు ముందుకు రావడాన్ని టాలీవుడ్ హీరో మంచు మనోజ్ అభినందించారు. విద్యావంతుల ద్వారా ప్రజా సేవ చేస్తే ఆ సేవకి ఒక విలువ, అర్థం ఉంటాయి.

పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని వాళ్ళని నమ్మి, వారిపై గౌరవంతో జనసేన పార్టీలోకి చేర్చుకోవడం ఆనందదాయకం అని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన మనోజ్ పొన్ రాజ్, పుల్లారావు వంటి నిపుణులు జనసేనలో చేరిన సందర్భంగా తీసిన ఫొటోను ట్వీట్ చేసారు.