సర్వే ప్రకారమే టికెట్: జగన్

SMTV Desk 2019-02-01 12:16:21  YCP Chief Jagan, Prashanth Kishore Team, AP Assembly elections

ఆంధ్ర ప్రదేశ్, ఫిబ్రవరి 1: ఆంద్ర ప్రదేశ్ లో రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించి రాజకీయ వర్గాలు, ప్రజలు ఉత్కంటతో ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీ చీఫ్ జగన్ నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌షాంత్ కిషోర్ టీమ్‌తో స‌ర్వే చేయిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల్లోని సెగ్మెంట్ వారిగా జ‌నంప‌ల్స్ శ్యాంపిల్స్ తీసుకున్న పీకే టీమ్, వాటికి స‌బంధించిన నివేధిక‌ల‌ను జ‌గ‌న్‌కు స‌మ‌ర్పించార‌ని సమాచారం. కానీ అభ్యర్ధుల విష‌యంలో చేయించిన స‌ర్వే మాత్రం ఇంకా పూర్తి కాలేదు.

రాష్ట్రంలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండగా ఇప్ప‌టి వ‌ర‌కు 85 అసెంబ్లీ స్థానాల్లోనే అభ్య‌ర్ధుల విష‌యంలో స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని, మిత‌గా 90 స్థానాల్లో అభ్య‌ర్ధుల విష‌యంలో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతుంద‌ని తెలుస్తోంది. దీంతో అభ్య‌ర్ధుల‌కు సంబంధించిన పీకే స‌ర్వే రిపోర్ట్స్ ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలోపు అంద‌జేయాల‌ని వైసీపీ అధిష్టానం ఆదేశించిద‌ని తెలుస్తోంది. ఎందుకంటే జ‌గ‌న్ బ‌స్సుయాత్ర‌కు ముందే ఎక్కువ మంది అభ్య‌ర్ధ‌ల‌ను ప్ర‌క‌టించాని భావిస్తున్నారు. దీంతో పీకే టీమ్‌కు సంబంధించి ప‌లు బృంధాలు రంగంలోకి దిగాయ‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు ఇంచార్జ్‌లు ఉండ‌డంతో, వారి మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌క‌పోవ‌డంతో, జ‌గ‌న్ వారిని సముదాయిస్తున్నారు. ఈ క్ర‌మంలో